జాతీయ వార్తలు

తమిళనాడుకు పూర్తి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, ఫిబ్రవరి 17: తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అయనా అక్కడి ప్రభుత్వాన్ని కేంద్రం బలపరుస్తుందని, అవసరమైన సహాయం చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తమిళనాడులో అధికార అన్నాడిఎంకె ఆంతరంగిక వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకో బోదని తెలిపారు. తమిళనాడు లో తమకు కావలసింది స్థిరమైన ప్రభుత్వ మే తప్ప, దానికి ఎవరు ముఖ్యమంత్రి అన్నది కాదని ఆయన స్పష్టం చేశారు.
అవి అసంతృప్త ప్రేలాపనలు
మహారాష్టల్రో ఒక వెలుగు వెలిగిన శివసేన, ఇప్పుడు బలహీనపడిన అసంతృప్తితో అధికార బిజెపిపై విమర్శలకు దిగుతోందని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి వెంకయ్యనాయుడు ఘాటుగా విమర్శించారు. ‘స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాల్సిన తరుణంలో సమస్యలకు పరిష్కారాలు అనే్వషించాలి తప్ప, అధికారంలో భాగస్వామ్యపక్షంగా ఉండి విమర్శలకు దిగడం ఎంతమాత్రం సహేతుకం కాదని శివసేనకు హితవు పలికారు. ఎన్నికల ప్రచారాల్లో ఒకరికొకరు విమర్శలు గుప్పించుకోవడాన్ని ప్రస్తావిస్తూ, పార్టీలు నిగ్రహం పాటించాలని సూచించారు. వచ్చే 21న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో పార్టీల ప్రచారం ఉధృతస్థాయికి చేరి, బిజెపి, శివసేనలు పరస్పరం తీవ్ర విమర్శలకు దిగుతుండటం తెలిసిందే. ఈ అంశంపై వెంకయ్య స్పందిస్తూ ‘స్థానిక ఎన్నికల్లో ఒకసారి పొత్తులు ఉండొచ్చు. మరోసారి ఉండకపోవచ్చు. అంతమాత్రం చేత విమర్శలకు దిగడం సరికాదు. నిగ్రహం పాటించాలి’ అని వెంకయ్య హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి బలంగా ఉందని వెంకయ్య స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు రాష్ట్రంలో బలంగావున్న శివసేన ప్రస్తుతం బలహీనపడింది. ఆ అసంతృప్తితో సేన పార్టీ నేతలు అనవసర విమర్శలకు దిగుతున్నారు’ అని వెంకయ్య ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘పొత్తులకు సంబంధించి ఇంతవరకూ శివసేన నుంచి బిజెపికి ఎలాంటి సమాచారం అందలేదు. వస్తే, పరిశీలించి ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటాం’ అని వెంకయ్య ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘స్థానిక ఎన్నికల్లోనూ బిజెపికి కచ్చితమైన మెజార్జీ లభించడం ఖాయమని, ఈ విషయంలో ఏ పార్టీతోనూ రాజీపడాల్సిన అవసరం పార్టీకి లేదు’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశముందని, అదే జరిగితే ఎన్సీపీతో బిజెపి జతకట్టవచ్చన్న శరద్ పవార్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘ఆయన అత్యంత మేధావి. కాకపోతే, బిజెపిలో మేథావులకు కొదువలేదు’ అని వెంకయ్య చమత్కరించారు.