జాతీయ వార్తలు

అన్నాడిఎంకె హైడ్రామాలో మరో ట్విస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 17: తమిళనాడులో అధికార అన్నాడిఎంకెలో తలెత్తిన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం శనివారం తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శశికళ వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేయడానికి పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని ప్రత్యర్థివర్గం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తనపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన పళనిస్వామితో పాటుగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ మధుసూదనన్‌ను అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ గత వారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంనుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం తమదే అసలైన అన్నాడిఎంకె అని మధుసూదనన్ అంటూ, శశికళను, రెండు జుల క్రితమే పార్టీలో చేరిన ఆమె సమీప బంధువులు టిటికె దినకరన్, ఎస్ వెంకటేశ్‌లను పార్టీ ప్రాథమిక సభ్యత్వంనుంచి బహిష్కరించారు. ఆయన అంతటితో ఆగలేదు. మరి కొద్ది గంటల తర్వాత గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామితో పాటు రాష్టమ్రంత్రులు దిండిగల్ సి శ్రీనివాసన్, పి తంగమణి, సి వీ షణ్ముగం, కె రాజు, ఆర్‌బి ఉదయ్‌కుమార్‌లతో పాటుగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రాజ్యసభ ఎంపి నవనీత కృష్ణన్‌లను కూడా పార్టీనుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలు, వౌలిక సూత్రాలకు విరుద్ధంగా నడుచుకోవడం ద్వారా పార్టీకి అప్రతిష్ఠ తీసుకు వస్తున్నందుకు పళనిస్వామి, మంత్రులపై బహిష్కరణ వేటు వేసినట్లు మధుసూదనన్ ఒక ప్రకటనలో తెలిపారు. శశికళపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అంతేకాకుండా ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందువల్లనే ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వంనుంచి తొలగించినట్లు రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంనుంచి అన్నాడిఎంకె లెటర్‌హెడ్‌పై విడుదల చేసిన ఆ ప్రకటనలో మధుసూదనన్ పేర్కొన్నారు.