జాతీయ వార్తలు

గాడ్సే ఏం చెప్పాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మహాత్మాగాంధీ హత్యకు సంబంధించిన ఇతర రికార్డులతో పాటుగా ఆయనను కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను జాతీయ ప్రాచ్య పత్ర భాండాగారం (నేషనల్ ఆర్కైవ్స)కు చెందిన వెబ్‌సైట్‌లో తక్షణం ఉంచాలని కేంద్ర సమాచార కమిషన్(సిఐసి) తీర్పు చెప్పింది. ‘నాథూరాం గాడ్సే, ఆయన సహ నిందితుడి వైఖరులను ఎవరైనా అంగీకరించకపోవచ్చు, అం తమాత్రాన ఆయన అభిప్రాయాన్ని వెల్లడించడానికి లేదా సర్క్యులేషన్‌కు కానీ నిరాకరించడానికి వీల్లేదు’ అని సమాచార కమిషనర్ శ్రీ్ధర్ ఆచార్యులు తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ‘అదే సమయంలో నాథూరామ్ గాడ్సేకికానీ, ఆయన వాదన, లేదా అభిప్రాయం కలిగి ఉన్న వ్యక్తికికానీ వాటిని అంగీకరించని వ్యక్తిని చంపేదాకా వెళ్లే అధికారం కూడా లేదు’ అని ఆయన తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. నాథూరాం గాడ్సే 1948 జనవరి 30న మహాత్మాగాంధీని కాల్చి చంపిన విషయం తెలిసిందే. గాంధీజీ హత్యకు సంబంధించిన చార్జిషీట్, గాడ్సే స్టేట్‌మెంట్‌తోపాటుగా ఇతర వివరాలు ఇవ్వాలని పిటిషనర్ అశుతోష్ బన్సల్ ఆర్‌టిఐ దరఖాస్తులో ఢిల్లీ పోలీసులను కోరారు. అయితే ఆ రికార్డులను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు పేర్కొం టూ ఢిల్లీ పోలీసులు ఆయన దరఖాస్తును వారికి పంపించారు. అయితే రికార్డులు పరిశీలించి తనకు కావలసిన సమాచారాన్ని వెతికి తీసుకోవాలని నేషనల్ ఆర్కైవ్స్ బన్సల్‌కు సూచించింది. దీంతో బన్సల్ సిఐసిని ఆశ్రయించారు. కాగా, కావలసిన రికార్డులను ఫోటోకాపీ చేసుకోవడానికి పేజికి 3 రూపాయలను వసూలు చేయవద్దని, ఎందుకంటే సమాచార హక్కు చట్టం ప్రకారం అలా వసూలు చేయడానికి వీలు లేదని కూడా శ్రీ్ధర ఆచార్యులు ఎన్‌ఐఏ కేంద్ర ప్రజా సంబంధాల కమిషనర్‌ను ఆదేశించారు. పిటిషనర్ కోరిన సమాచారాన్ని వెల్లడించడానికి ఢిల్లీ పోలీసులు కానీ, నేషనల్ ఆర్కైవ్స్ కానీ అభ్యంతరం చెప్పనప్పటికీ ఈ సమాచారం ప్రత్యేక క్లాజ్‌ల పరిధిలోకి రాదని శ్రీ్ధర ఆచార్యులు స్పష్టం చేశారు. సమాచారం 20 ఏళ్లపైబడినదైతే, సమాచార హక్కు చట్టం 8(1)(ఏ) పరిధిలోకి రాని పక్షంలో ఆ సమాచారాన్ని ఆపడానికి వీలు లేదని ఆయన ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. దే శ భద్రతకు లేదా విదేశాలతో సంబంధాలకు విఘాతం కలిగించే సమాచారాన్ని వెల్లడించడాన్ని ఈ క్లాజ్ నిషేధిస్తోంది.