జాతీయ వార్తలు

నాదే అసలైన సమాజ్‌వాది పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటావా, ఫిబ్రవరి 17: సమాజ్‌వాది పార్టీకి కంచుకోట అయిన ఎటావాలో చిన్నాన్న శివపాల్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరోక్షంగా విమర్శలు కరిపిస్తూ, తన నేతృత్వంలోనిదే అసలైన సమాజ్‌వాది పార్టీ అని, తనను బలహీనపరచడానికి ప్రయత్నించే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.‘నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నవారు నాకు, నేతాజీకి (ములా యం) మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించారు. నా నుంచి సైకిల్ (ఎస్పీ గుర్తు)ను లాక్కోవడానికి వారు ప్రయత్నించారు’ అని ఎటావాలోని ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఎన్నికల సభలో తొలిసారిగా ప్రసంగిస్తూ అఖిలేష్ అన్నారు. ఇలాంటి వాళ్లే కొత్త పార్టీ పెట్టాలని అనుకున్నారని పొరుగున ఉన్న జశ్వంత్‌నగర్‌నుంచి పోటీ చేస్తున్న చిన్నాన్న, తనతో విభేదించి పార్టీని చీలిచచడానికి ప్రయత్నించిన శివపాల్ యాదవ్‌నుంచి ఆయన అన్నారు. రాష్ట్రంలో మిగతా చోట్ల జరుగుతున్న ఎన్నికలకు, ఇక్కడ జరుగుతున్న ఎన్నికలకు తేడా ఉందని, ఇక్కడ తనను ఓడించడమే వారి లక్ష్యమని ఆయన అంటూ, ఎటావా ప్రాంత ప్రజలు అలాంటి విరి కుట్రలకు బలి కారాదని అన్నారు. సభలో వేలాది మంది ఉన్నారని, మనదే అసలైన సమాజ్‌వాది పార్టీ అని అఖిలేష్ అన్నారు. తాను తరచూ ఎటావా రాని మాట నిజమేనని, అయితే అప్పుడు పరిస్థితి వేరని అంటూ, ఇప్పుడు తాను ఎటావాపై ఎక్కువ దృష్టిపెడతానని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక తాను కొత్త పార్టీ పెడతానని శివపాల్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రోజున చెప్పడం తెలిసిందే. కొంతమంది తనను పార్టీనుంచి గెంటేయడానికి ప్రయత్నించారని, అయితే వారి ప్రయత్నాలను తాను సాగనివ్వలేదని అఖిలేష్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను కృషి చేశానని, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చానని అంటూ, అయినప్పటికీ వారు తనను బలహీనపర్చడానికి ప్రయత్నించారన్నారు. కాగా, అఖిలేష్ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి శివపాల్ నిరాకరించారు. తనకు ములాయం ఆశీస్సులున్నాయని చెప్తూ, ఆయన ఆదేశాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ శివపాల్ అన్నారు.

చిత్రం..ఎటావాలోని ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన
ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్