జాతీయ వార్తలు

ఏపీలో రైల్వేజోన్ లేనట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని ఉంది కదా అని విలేఖరులు శుక్రవారం బోర్డు అధికారులను ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం వలన ఏం లాభం? అని వారు ఎదురు ప్రశ్నించారు. అలాగే విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదన రైల్వే మంత్రిత్వశాఖ ఎగ్జిక్యూటివ్ అధికారులతో వేసిన కమిటీ పరిశీలనలో ఉందని రైల్వేబోర్టు అధికారులు వెల్లడించారు. రైల్వేజోన్ ఏర్పాటు కోసం వేసిన కమిటీ నివేదిక రైల్వే మంత్రిత్వశాఖకు ఎప్పుడు సమర్పిస్తుంది? వంటివి వివరాలను అధికారులు వెల్లడించలేదు. కొత్తరైల్వే జోన్ ఇవ్వడం వల్లన ఒక రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనం ఏమి ఉండదని చెబుతూనే, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు డిమాండ్‌ను అంత సీరియస్‌గా పరిగణించడం లేదని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం నాడు ఢిల్లీలో రైల్వేబోర్డు అధికారులు రైల్వే మంత్రిత్వశాఖ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తిరుపతి నుంచి జమ్మూతావి మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చే మార్చి చివరి నాటికి ప్రారంభం కానున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనితో పాటుగా విశాఖ నుంచి విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు, అలాగే ఆంధ్ర మీదుగా వెళ్లే భువనేశ్వర్ - కృష్ణరాజపురం ఎక్స్‌ప్రెస్ రైలు, హౌరా-యశ్వంతపుర్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు, హౌరా-ఏర్నాకులం రైలు, కామత్తియా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ రైలు, సత్రాగంజ్-బెంగుళూరు రైలు అన్నీ త్వరలో ప్రారంభం కానున్నట్టు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ సమయం తగ్గించడానికి పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన వివిధ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూరు, కోటిపల్లి, నరసాపూర్, నూతన రాజధాని అమరావతి రైల్వే కనెక్టివిటీ, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పూర్తికి ఏపీ ప్రభుత్వం, రైల్వేమంత్రిత్వ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో పనిచేయడానికి చర్చలు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుందని స్పష్టం చేశారు.