జాతీయ వార్తలు

కార్తి అరెస్టుకు జాప్యమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, ఫిబ్రవరి 20: ఎయిల్‌సెల్-మాక్సిస్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన కార్తి చిదంబరంను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంపై చర్య తీసుకోవాలని దర్యాప్తు సంస్థలు సిఫారసు చేసినా ప్రభుత్వం అతని అరెస్టుకు అనుమతి ఇవ్వకపోవటం విచిత్రంగా ఉందన్నారు. ఎయిల్‌సెల్-మాక్సిస్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడటంతోపాటు నల్లధనం కేసులో కూడా కార్తి ఉన్నాడని స్వామి ఆరోపించారు.
ఈ వ్యవహారంలో కార్తి అక్రమాలకు పాల్పడినట్లు తనవద్ద సాక్ష్యాలున్నాయని సోమవారం స్వామి విలేఖరులకు కొన్ని పత్రాలు చూపించారు. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం జరిగిందని, చట్ట ప్రకారం విదేశీ సంస్థలు కేవలం 74 శాతం వాటాలు కొనేందుకు వీలుండగా మలేసియాకు చెందిన ఎయిల్‌సెల్ వాటాలను నూరు శాతం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారని సుబ్రమణ్య స్వామి వివరించారు. ఈ వ్యవహారంలో మారన్ సోదరులను నిందితులుగా చిత్రీకరించినా అసలు నిందితుడు కార్తి చిదంబరమేనని ఆయన ఆరోపించారు. కార్తి విదేశాల్లో 21 ఖాతాలు తెరిచి వీటిలో ఆరు లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లు 120 లక్షల కోట్లని స్వామి ప్రకటించారు. కార్తి చిదంబరం నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అతన్ని మూడుసార్లు తమ కార్యాలయానికి పిలిచినా ఆయన వెళ్లలేదని, ఒక్కసారి వెళ్లకపోయినా నేరమవుతుందని ఆయన గుర్తుచేశారు. విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నల్లధనాన్ని స్వదేశానికి తెస్తామని 2014 ఎన్నికల్లో దేశ ప్రజలకు బిజెపి హామీ ఇచ్చిందని, ఆ విషయాన్ని ఎలా మరచిపోతారని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా డిపాజిట్ చేసిన నల్లధనానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినా ఎన్‌డిఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. తమకీ వెసులుబాటు కల్పించినందుకు మలేసియన్ సంస్థ కార్తి చిదంబరంకు ముడుపులు చెల్లించుకున్నదని స్వామి ఆరోపించారు.