జాతీయ వార్తలు

కొలిక్కిరాని నటి కిడ్నాప్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచీ, ఫిబ్రవరి 20: మలయాళీ నటి కిడ్నాప్, వేధింపుల కేసులో నిందితులకోసం కేరళ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో సూత్రధారి పల్సర్ సన్నీ తదితరులను ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సోమవారం నాటికి కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. సన్నీకి సహకరించారన్న అనుమానంతో పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడమే తప్ప సూత్రధారి ఆచూకీ తెలియరాలేదు. సంఘటన జరిగి మూడురోజులు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి కారు డ్రైవర్ మార్టిన్ కిడ్నాపర్లకు సహకరించాడన్న అనుమానంతో ఇంతకుముందే అతడిని అరెస్టు చేశారు. నటిని కిడ్నాప్ చేసి కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అలప్పుఝా జిల్లా అంతటా గాలింపుచేపట్టారు. సన్నీ కోచీ నగరానికి చెందినవాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే పిటి థామస్ చెప్పారు. కిడ్నాప్ విషయం తెలియగానే నటుడు, దర్శకుడు లాల్ నివాసానికి హుటాహుటిన ఆయన చేరుకున్నారు. తరువాత కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని బాధితురాలు అక్కడికి వచ్చింది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు చీఫ్‌కు ఫిర్యాదు చేసినట్టు దర్శకుడు లాల్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయని, అయితే అవేవీ బయటకు రాలేదని అన్నారు. తాజా ఘటనను కోలీవుడ్ నటీనటులు తీవ్రంగా ఖండించారు.