జాతీయ వార్తలు

పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియ నిలిచిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారత్-పాకిస్తాన్ మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త భారత్-పాకిస్తాన్ చర్చలపై ఇటీవల ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత్ ఈ వివరణ ఇచ్చింది. ‘పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను నిలిపివేయలేదు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడి విషయంలో దర్యాప్తు చేస్తున్న పాకిస్తాన్ జాయింట్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (జిట్) పఠాన్‌కోట్ సందర్శన ‘చాలా నిర్మాణాత్మక’ రీతిలో జరిగింది’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. జిట్ పఠాన్‌కోట్ సందర్శన ‘చాలా నిర్మాణాత్మక, సహకారపూరిత వాతావరణం’లో జరిగిందని ఆయన అన్నారు. అన్ని రకాల ఉగ్రవాదంపై యుద్ధంలో సహకారాన్ని స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను నిలిపివేయలేదని ఆయన నొక్కిచెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోయినట్లు ఇటీవల పాకిస్తాన్ దౌత్యవేత్త ఢిల్లీలో చేసిన ప్రకటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే తమ దౌత్యవేత్త ప్రకటనను భారత ప్రసార సాధనాలు ఎక్కువ చేసి ప్రచారం చేశాయని పాకిస్తాన్ నిందించింది. ‘పొరుగు దేశాలయిన భారత్, పాకిస్తాన్‌లు శాంతి, సామరస్యంతో సాగాలి. అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలను ఇండియన్ మీడియా ఎక్కువ చేసి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అది సరికాదు’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా ఇస్లామాబాద్‌లో విలేఖరుల సమావేశంలో అన్నారు. అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘ఈ ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారు. భారత్ ఎప్పుడు ముందుకొచ్చినా ఆ దేశంతో చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంటుందని నేను ఇటీవలి ప్రకటనలకు జత చేస్తున్నాను. అయితే ఇరువర్గాలు ఉపయోగించిన పదాలపై చర్చలోకి నేను వెళ్లబోను’ అని జకారియా అన్నారు.