జాతీయ వార్తలు

శబరిమల కేసులో తీర్పు రిజర్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశానికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపాలా వద్దా అన్నదానిపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వులో ఉంచింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ సోమవారం దీన్ని విచారించింది. న్యాయస్థానం నియమించిన మధ్యవర్తిసహా పలువురి అభిప్రాయాలు కోరింది. వారి అభిప్రాయాలు విన్న తరువాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపే విషయమై తుది నిర్ణయం తీసుకుంటారు. ‘ప్రతివాదుల సూచనలు, సలహాలు కోరాం. వారి అభిప్రాయాలు చెప్పేవరకూ తీర్పును రిజర్వ్‌లోనే ఉంచుతాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఆహ్వానిస్తూ, అలాగే వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు స్వీకరించింది. చారిత్రక శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గత నవంబర్ 7న కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.