జాతీయ వార్తలు

విషం చిమ్ముతున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వాతావరణాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విషపూరితం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించింది. ‘మన రాజ్యాంగం దేశాన్ని విభజించేందుకు ఏ వ్యక్తినీ అనుమతించదు. కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ జాతి పేరుతో కానీ ఎవరూ ఈ దేశాన్ని విడగొట్టలేరు. ప్రధానమంత్రి కూడా రాజ్యాంగానికి అతీతుడేం కాదు’ అని పార్టీ సీనియర్ నేత ఆనంద్‌శర్మ అన్నారు. మోదీపై కేంద్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ రాజ్యాంగాన్ని గౌరవించటం లేదని, ప్రధానిగా తాను చేసిన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారుని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఈ రకంగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్న మోదీపై తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.