జాతీయ వార్తలు

మొయిన్ ఖురేషీ కేసులో సిబిఐ మాజీ డైరెక్టర్‌పై ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, ఫిబ్రవరి 20: సిబిఐ మాజీ డైరెక్టర్ అమర్‌ప్రతాప్ సింగ్‌పై ఆ సంస్థ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వివాదాస్పద మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీకి లబ్ధి చేకూర్చారన్న అభియోగాలపై సిబిఐ ఆయనపై కేసు పెట్టింది. అమర్ ప్రతాప్‌సింగ్‌తో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న ఆదిత్య శర్మ, ట్రైమాక్స్ గ్రూప్ కంపెనీల యజమాని కోనేరు ప్రదీప్‌పై కూడా కేసులు నమోదు చేసింది. వీరికి సంబంధించి న్యూఢిల్లీ, చెన్నై, ఘాజియాబాద్‌లలోని కార్యాలయాలు, ఇతర భవనాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. ప్రభుత్వోద్యోగుల నుంచి లబ్ధి చేకూర్చేందుకు చాలామంది నుంచి అమర్‌ప్రతాప్‌సింగ్ డబ్బులు తీసుకున్నారని సిబిఐ అభియోగాలు మోపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. సింగ్ ఇళ్లతోపాటు కోనేరు ప్రదీప్ ఇంట్లో కూడా సోదాలు చేశామని అధికారులు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కూడా కోనేరు ప్రదీప్ నిందితుడుగా ఉన్నారని తెలిపారు.