జాతీయ వార్తలు

స్పీకర్‌పై డిఎంకె అవిశ్వాస తీర్మానం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 20: అసెంబ్లీలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ధనపాల్ తన వర్గాన్ని రక్షించుకోవడానికి అవాంఛనీయ ఘటనలను ప్రేరేపించారని ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్ ఆరోపించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా స్వీకర్ వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి అవసరమైన సభ్యుల సంఖ్య 34 అని, తమ పార్టీ సభ్యులు అందుకు సరిపోతారని అన్నారు. తమిళనాడు శాసనసభలో డిఎంకెకు 89మంది సభ్యుల బలం ఉంది. అయితే అసెంబ్లీలో డి ఎంకె సభ్యులే రభస సృష్టించారన్న ఆరోపణలను స్టాలిన్ ఖండించారు. వీడియో రికార్డింగ్ ప్రభుత్వం నియంత్రణలో ఉందని, కొన్ని దృశ్యాలను ఎడిట్ చేసి మీడియాకు విడుదల చేశారని ఆరోపించారు.
గవర్నర్‌కు కార్యదర్శి నివేదిక
ముఖ్యమంత్రి విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన ఘటనలపై తమిళనాడు శాసనసభ కార్యదర్శి ఏఎంపి జమాలుద్దీన్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు సోమవారం నిజ నిర్ధారణ నివేదిక సమర్పించారు. శనివారం ఉదయం 11గంటలకు సభ ప్రారంభమైందని, అక్కడి నుంచి మధ్యాహ్నం 3.27గంటలకు నిరవధిక వాయిదా పడేంత వరకు జరిగిన ఘటనలను ఆయన తన నివేదికలో పొందుపరిచారు.