జాతీయ వార్తలు

కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో మొదలైన ఎన్నికల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/ తిరువనంతపురం, ఏప్రిల్ 22: ఎన్నికల సంఘం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసింది. దీంతో మే 16న జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయింది. తమిళనాడులోని 234 నియోజకవర్గాలలో, కేరళలోని 140 నియోజకవర్గాలలో, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 29. మరుసటి రోజు వీటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మే రెండో తేది. మే 16న పోలింగ్ నిర్వహించి, 19న ఓట్లు లెక్కిస్తారు.
తమిళనాడులో సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 65వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తమిళనాడులో బహుముఖ పోటీ జరుగనుంది. ఎఐఎడిఎంకె, డిఎంకె, పిడబ్ల్యుఎఫ్- డిఎండికె- టిఎంసి కూటమి, పిఎంకె, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి ఇక్కడ తలపడుతున్నాయి. ఎఐఎడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జె.జయలలిత, డిఎంకె అధ్యక్షుడు ఎం.కరుణానిధి, అతని కుమారుడు ఎం.కె.స్టాలిన్, డిఎండికె వ్యవస్థాపకుడు విజయకాంత్, ఎండిఎంకె అధినేత వైకో, పిఎంకె అధినేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్‌లు తమ పార్టీల తరపున ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 9,48,717 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,97,790 మంది మహిళలు. 930 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.