జాతీయ వార్తలు

బెహెన్‌జీ సంపత్తి పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలౌన్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 20: సంపదను కూడబెట్టినవారు ప్రజా సమస్యలను పరిష్కరించలేరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ రీజియన్ జలౌన్‌లో సోమవారం బిజెపి నిర్వహించిన ఒక ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ సంపదను కూడబెట్టుకున్న వారు ఎన్నటికీ ప్రజల సమస్యలు పరిష్కరించలేరని పరోక్షంగా మాయావతిపై ధ్వజమెత్తారు. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)ని ‘బెహెన్‌జీ సంపత్తి పార్టీ’గా అభివర్ణిస్తూ, నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై ఆయన విరుచుకుపడ్డారు. బిఎస్‌పి ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ కాదని, ‘బెహెన్‌జీ సంపత్తి పార్టీ’గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ‘బెహెన్‌జీ’గా ప్రాచుర్యం పొందిన మాయావతిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు ఎక్కడికి చేరింది? నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించగానే, అప్పటివరకు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోని బద్ధ విరోధులయిన ఎస్‌పి, బిఎస్‌పి ఒక్కటయ్యాయి. అవినీతిపై నేను యుద్ధం ప్రకటించి, నల్లధనం వివరాలు అడగగానే ఒక్కటయిన ఈ పార్టీలను చూసి నేను విస్తుపోయాను. వీరిద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్‌తో కలిసి ఒకే భాషలో మాట్లాడటం మొదలుపెట్టారు’ అని మోదీ అన్నారు. ఈ పార్టీల బాధంతా నోట్లు రద్దు చేయడంపై కాదని, వారు కూడబెట్టిన నల్లధనాన్ని దాచుకోవడానికి తగినంత సమయం లేదనేనని అన్నారు. ‘నోట్ల రద్దు తరువాత అకస్మాత్తుగా డబ్బు బ్యాంకుల్లో జమకావడం మొదలయింది. దీంతో ఇదేంటంటూ మాయావతి విమర్శించడం మొదలుపెట్టారు’ అని మోదీ అన్నారు.

చిత్రం..ఫుల్‌పూర్‌లో సోమవారం బిజెపి పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో ఓటర్లకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ