జాతీయ వార్తలు

500 మద్యం షాపుల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 20: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తనదైన ముద్ర పడే దిశగా పరిపాలన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నడిపిస్తున్న 500 మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది కాలంలో రాష్ట్రంలో మూసివేసిన మద్యం షాపుల సంఖ్య దీంతో వెయ్యికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సోమవారం ముఖ్యమంత్రి పళనిస్వామి సంతకం చేశారు. శాసనసభలో 122-11 ఓట్ల తేడాతో విశ్వాస పరీక్ష నెగ్గిన రెండు రోజుల తరువాత ఆయన నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించారు. 2016లో దివంగత అన్నాడి ఎంకె అధినేత్రి జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా మద్యంపై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చారు. ఆమె జీవించి ఉన్న సమయంలోనే ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న 500 షాపులను మూసివేశారు. ఆమె మరణానంతర పరిణామాల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి తొలి సంతకం మద్యం షాపుల మూసివేతపైనే పెట్టడం విశేషం. 2016 ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని పార్టీలు కూడా మద్యం నిషేధంపై పోరాటం చేసినవే. దీంతోపాటు గర్భిణులకు ఇస్తున్న ప్రసూతి సహాయాన్ని రూ.16వేల నుంచి రూ.18వేలకు పెంచారు. ద్విచక్రవాహనాలు కొనే మహిళలకు 50శాతం సబ్సిడీ, జాలర్లకు ఉచిత ఇళ్లు, నిరుద్యోగుల భృతి పెంపు వంటి అంశాలపై పళనిస్వామి నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగ భృతిని వివిధ దశల్లో రూ.50, 200, 300 రూపాయల చొప్పున పెంచారు. ఇందుకోసం రూ.200 కోట్ల వార్షిక కేటాయింపులు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హౌసింగ్ స్కీంకు రూ.85కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ హామీలన్నీ దివంగత జయలలిత ప్రజలకు ఇచ్చినవేనని, గౌరవనీయురాలైన అమ్మ, చిన్నమ్మ ఆశీస్సులతో తాను ఈ ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను ఎదుర్కోవటానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర డిజిపి సహా పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని సోమవారం ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు.
ఇండోర్: అమ్మ జయలలిత కలలను నిజంచేసే దిశగా తమిళనాడు అభివృద్ధి పథంలో కొత్తశకం ప్రారంభమైందని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడిఎంకె సీనియర్ నేత ఎం.తంబిదురై వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని, చిన్నమ్మ (శశికళ) మార్గదర్శనంలో అమ్మ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఇండోర్‌లో వ్యాఖ్యానించారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం తిరిగి పార్టీలోకి వస్తామంటే తీసుకుంటారా అన్న ప్రశ్నకు తంబిదురై సమాధానమిస్తూ, దీనిపై నిర్ణయం తీసుకోవలసింది శశికళేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో అవాంఛిత ఘటనలకు డిఎంకె కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు.

చిత్రం..సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామి