జాతీయ వార్తలు

జరిమానా కట్టకుంటే మరో 13 నెలలు జైలుశిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 21: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్షతో పాటుగా రూ.10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. ఒకవేళ శశికళ ఆ పది కోట్ల జరిమానా కట్టకుంటే ఏమవుతుందనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అయితే శశికళ గనుక ఆ జరిమానా కట్టకపోతే మరో 13 నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని కర్నాటక జైళ్ల శాఖ సూపరింటెండెంట్ కృష్ణకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న శశికళ, ఆమె బంధువులకు ట్రయల్ కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఈ నెల 14న ఖరారు చేస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ జైలుశిక్షతోపాటుగా తలా 10 కోట్ల చొప్పున జరిమానా కూడా విధించారు. కాగా, 2014లో ట్రయల్ కోర్టు శశికళను దోషిగా నిర్ధారించిన తర్వాత ఆమె 21 రోజులు కర్నాటకలోని పరప్పన అగ్రహార జైలులో గడిపారు. దీంతో ఆమె ఇప్పుడు మిగతా 3 సంవత్సరాల 11 నెలల జైలుశిక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది
కాగా, ఈ కేసులో శిక్షలు పడిన శశికళ, ఆమె వదిన ఇలవరసి, జయలలిత దత్తపుత్రుడు, శశికళ దగ్గరి బంధువు సుధాకరన్‌లను జైల్లో మిగతా ఖైదీల మాదిరిగానే చూడడం జరుగుతోందని, వారికి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని కృష్ణకుమార్ స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా శశికళ, ఇలవరసిలను మహిళల బ్లాక్‌లో ఉంచడం జరిగిందని, వారు చిన్న గదుల్లో ఉంటున్నారని, సుధాకరన్‌ను పురుషుల బ్లాక్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు. జైల్లో తయారు చేసిన ఆహారమే వారికీ ఇస్తున్నారని, జైలు డాక్టర్లు రెగ్యులర్‌గా వారికి మెడికల్ చెకప్‌లు నిర్వహించి, మందులు ఇస్తున్నారని ఆయన చెప్పారు. అందరూ చూసేచోట టీవీ చూడడానికి వారిని అనుమతిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.