జాతీయ వార్తలు

‘ఆయుష్’ను ప్రోత్సహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఆయుష్, ఆయుర్వేద వంటి ప్రత్యామ్నాయ వైద్య చికిత్సా విధానాలను ప్రోత్సహించాల్సిందిగా విదేశాలలో ఉన్న ఇండియన్ మిషన్‌లను ఆదేశించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ తెలిపారు. ఆయుష్, ఆయుర్వేద వంటి ప్రత్యామ్నాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి తీవ్రంగా కృషి చేయాలని ఇండియన్ మిషన్‌లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఆయన వివరించారు. 25 ఇండియన్ మిషన్‌లలో ఆయుష్ వైద్య కేంద్రాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటి సామర్ధ్యాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేవిధంగా వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఇక్కడ మంత్రి ‘అసోచామ్ కాన్ఫరెన్స్ ఆన్ మెడిట్రావెల్- 2017’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీసా పద్ధతులను సులభతరం చేయవలసిన అవసరం గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలుసని, మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ దిశగా అన్ని మిషన్‌లను చైతన్యవంతం చేసిందని చెప్పారు. విదేశాల నుంచి వైద్యచికిత్సకోసం వచ్చే ప్రజలకు పరిస్థితులను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం సలహాలను, సిఫార్సులను స్వీకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. కొత్త కార్యక్రమం ఏం చేపట్టినా దుర్వినియోగం కావడం కొంతవరకు ఉంటుందన్నారు. అయితే ఇక్కడి వైద్యరంగానికి అద్భుతమైన సామర్థ్యం ఉందని, దీనివల్ల భారత్ వైద్య సౌకర్యాల కేంద్రంగా మారగలదని, మిగతా ప్రపంచం నుంచి ప్రజలు ఇక్కడికి రావడానికి వీలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మనవద్ద సంప్రదాయ వైద్యం, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు రెండూ ఉన్నాయని, అందువల్ల తక్కువ వ్యయంతో చికిత్స పొందడానికి ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు భారత్‌వైపు చూస్తున్నారని ఆయన వివరించారు.