జాతీయ వార్తలు

వెలుగుబాట భారత నాగరికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువళ్ల (కేరళ), ఫిబ్రవరి 21: కుల మతాల ప్రాతిపదికన కొందరు వ్యక్తులు సమాజాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత నాగరికత అత్యంత ఉన్నతం, ఘనమైనదని, శతాబ్దాల చరిత్రలో ఈ రకాల సవాళ్లు ఎన్నింటిలో అధిగమించిందని స్పష్టం చేశారు. ‘శ్రీరామకృష్ణ వచనామృత శాస్త్రం’ అనే ఏడు రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మంగళవారం మాట్లాడారు. శ్రీరామకృష్ణ ప్రవచనాలు కాలాతీతమైనవి, నేటి సమాజ పరిస్థితులకు కూడా అవి ఎంతగానో వర్తిస్తాయని మోదీ తెలిపారు. ముఖ్యంగా ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ సమాజాన్ని కుల మతాల ప్రాతిపదికన నిర్వీర్యం చేసే శక్తులు నేటికీ పనిచేస్తున్న నేపథ్యంలో శ్రీరామకృష్ణ ప్రవచనాలు ఎంతగానో ఆచరణీయమైనవేనని మోదీ తెలిపారు. మానవ నాగరిక చరిత్రలో భారత్ ఈ రకమైన అవరోధాలను, సవాళ్లను ఎంతగానో ఎదుర్కొందని, వాటన్నింటినీ అధిగమించి జాజ్వంల్యంగా ముందుకు సాగుతూ వచ్చిందని చెప్పారు. మానవ నాగరికత ఎప్పుడు సరికొత్త విజ్ఞాన శకంలోకి అడుగుపెట్టినా అందుకు మార్గాన్ని చూపిన ఘనత భారతదేశానిదేనని మోదీ తెలిపారు. మనుషుల మధ్య వైషమ్యాలను, అవరోధాలను సృష్టించే మానసిక వైరుధ్యాలను శ్రీరామకృష్ణ పటాపంచలు చేశారని, ఆయన ముస్లిం జీవనాన్ని అనుసరించారు. క్రైస్తవ జీవన విధానాన్ని అవపోసన పట్టారు. అలాగే అన్ని రకాలుగానూ మానవ నాగరికత ఔన్నత్యానికి దివిటీ పట్టే రీతిలో సమున్నతంగా జీవనాన్ని సాగించారని మోదీ తెలిపారు. వాస్తవం ఒకేనని, అంతా సమానమేనని తేడాఅల్లా కేవలం పేరులోనూ, రూపంలోనేనని శ్రీరామకృష్ణ స్పష్టం చేశారని తెలిపారు. కేరళలో సామాజిక పరివర్తనను తీసుకురావడంలో సామాజిక కార్యకర్త శ్రీ నారాయణ గురు అవిరళంగా కృషిచేశారని మోదీ గుర్తుచేశారు. మన తత్త్వవేత్తలు, ఋషులు, ఆధ్యాత్మికవేత్తలు చేసింది స్వల్పమేనైనా వారి కృషి ఫలితం సమాజంపై అసాధారణంగా ఉందని, నిరంతరం అది మానవ చరిత్ర గనితి గుణాత్మక రీతిలో మారుస్తూనే ఉందని తెలిపారు. భారత సాధువులు తమ సామాజిక సంస్కరణల్లో భాగంగా సామరస్య భావనలను పాదుగొల్పాలని, ప్రతి ఒక్కరినీ దీని పరిధిలోకి తీసుకొచ్చారని మోదీ తెలిపారు. ఇతరులు సృష్టించిన సామాజిక, రాజకీయ ఆర్థిక సంస్కరణ బాటనే భారత్ అనుసరించాల్సి వస్తోందన్న తప్పుడు భావనను సృష్టిస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అనాదిగా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ వచ్చిన భారత నేలే అన్ని రకాల మార్పులకు ఆద్యురాలిగా నిలిచిందని, ప్రతి మార్పు దీన్నుంచే అంకురించిందని మోదీ స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విలువలను ప్రోది చేసుకుంటూ భారత నాగరికత బలోపేతం అవుతూ వస్తోందని అన్నారు. సరైన రీతిలో జీవనాన్ని సాగించే విధంగా ధర్మాన్ని అందరికీ వర్తింపజేయాలని, ప్రజల జీవనంలో దీనిని అవిభాజ్యమైన భాగంగా మార్చాలని అన్నారు. సంగీతం, సాహిత్యం, స్థానిక భాషల ద్వారా భారత సాధువులు భగవంతుణ్ణి ప్రజలకు సన్నిహితం చేశారని, ఆ విధంగా కుల, వర్గ, మత, లింగపరమైన అవరోధాలను తొలగించారని తెలిపారు.

చిత్రం..కేరళలో జరుగుతున్న ‘శ్రీరామకృష్ణ వచనామృత శాస్త్రం’ సదస్సును ఉద్దేశించి
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ