జాతీయ వార్తలు

ఐసిస్‌కు శాంతి చర్చలు గిట్టవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తల, ఏప్రిల్ 22: ఐసిస్ ఉగ్రవాదులతో శాంతి చర్చలు జరపాలన్న పండిట్ రవిశంకర్ ప్రయత్నం ఎదురుతిరిగింది. శాంతి చర్చలు ప్రతిపాదించిన రవిశంకర్‌కు సమాధానంగా ఐసిస్ ఉగ్రవాదులు ఏకంగా తలలేని మొండెం ఫొటోను పంపించారు. ఈ విషయాన్ని అగర్తలాలో రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో శాంతి చర్చలు జరిపేందుకు చొరవ తీసుకుందామని అనుకున్నానని, కానీ అందుకు బదులుగా వారు తల లేని మొండెం ఫొటోను పంపించారని రవిశంకర్ పేర్కొన్నారు. దీంతో శాంతి చర్చలు జరపాలన్న నా ప్రయత్నం ముగిసింది అని స్పష్టం చేశారు. ఐసిస్ ఉగ్రవాదులకు శాంతి చర్చలు ఎంతమాత్రం ఇష్టం లేదని అర్థమైందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకున్న రవిశంకర్ తిరుగు ప్రయాణానికి ముందు విలేఖరులతో మాట్లాడారు. ఈశాన్య ప్రాంతంలోనూ శాంతి నెలకొనేందుకు చర్చలే పరిష్కారమని పేర్కొన్నారు.