జాతీయ వార్తలు

భారత్‌కున్న త్రిగుణాలు సహనం.. దయ.. దేశభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశంలో విభిన్న సమాజాల మధ్య సహనం, అందరి పట్ల కరుణ, ప్రేమ, మాతృభూమి పట్ల ఎనలేని దేశభక్తి భారత్‌కు ఉన్న వౌలిక విలువలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘్భరత్ విధానం సుసంపన్నమైన సంప్రదాయాలు, నాగరిక విలువలను ప్రపంచానికి అందించింది. ఇవి సార్వకాలికమైనవి. ఇవాళ్టికీ వర్తించేవి’ అని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం, భారతీయ శిక్షణ్ మండల్‌లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒక్కోసారి నాకు ఆశ్చర్యమేస్తుంది. ఇంత పెద్ద బహుళ సంస్కృతులున్న సమాజం మనది. దాదాపు 200 భాషలు, 1800కు పైగా మాండలికాలు, ప్రపంచంలోని ఏడు ప్రధాన మతాలు ఇవన్నీ మన దేశంలో ఉన్నప్పటికీ అంతా ఒకటిగా కలిసి ఉంటున్నాం, ఒక రాజ్యాంగం కింద, ఒక జెండా కింద ఏకత్రితమై నివసిస్తున్నాం. భారతీయతపై నా దృష్టికోణం ఇదే’ అని ప్రణబ్ వివరించారు. దేశంలో భిన్నత్వం ఎంతగా ఉన్నప్పటికీ అందులోనే ఒకటిగా కలిసి జీవిస్తున్నామని, అదే సమయంలో వ్యక్తిగత అంశాలనూ మరచిపోవటం లేదని, ఇలాంటి జీవన విధానం కేవలం మన దేశంలోనే సాధ్యపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

చిత్రం..గురువారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్‌కు సావనీర్‌ను అందజేస్తున్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్