జాతీయ వార్తలు

అమ్మ ప్రేమతో ఆదరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 23: అమ్మబాట నుంచి దారితప్పిన వారిని తిరిగి అదేబాటలోకి సాదరంగా ఆహ్వానిస్తామని అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ గురువారం అన్నారు. పార్టీ నుంచి బహిష్కృతులైన వారినందరినీ తిరిగి పార్టీలోకి అమ్మ ప్రేమతో ఆదరిస్తామన్నారు. తాను పార్టీలోకి తిరిగి రావటంపై వచ్చిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తనను రాజకీయాల్లోకి దివంగత నేత జయలలితే తీసుకువచ్చారని, ఆమెవల్లే తాను రాజకీయాల్లో ఎదిగానన్నారు. పార్టీలో అనేక పదవులు, బాధ్యతలను తనకు అప్పగించారని ఆయన వివరించారు. తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఇచ్చారని అన్నారు. ‘అమ్మ ఉద్యమం నుంచి దారి తప్పినవాళ్లు తప్పకుండా తిరిగి అమ్మ ఒడిలోకి చేరకుంటారని మాకు విశ్వాసం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా శుక్రవారం నుంచి రథయాత్ర చేపట్టనున్న మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంపై ఆయన స్పందిస్తూ అన్నాడిఎంకె గతంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొందని, అన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తుందని దినకరన్ పేర్కొన్నారు. తమకు పన్నీర్‌సెల్వం కంటే, డిఎంకెయే ప్రధాన ప్రత్యర్థి అని ఆయన స్పష్టం చేశారు. అన్నాడిఎంకెను స్వర్గీయ ఎంజి రామచంద్రన్ స్థాపించారని, డిఎంకెకు వ్యతిరేకంగానే పార్టీ ఆవిర్భవించిందని దినకరన్ అన్నారు అసెంబ్లీలో కూడా స్టాలిన్ పన్నీర్ సెల్వంను పావులా వాడుకుని రభస సృష్టించే ప్రయత్నం చేసి విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.