జాతీయ వార్తలు

కేరళ హీరోయిన్‌పై వేధింపుల కేసులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, ఫిబ్రవరి 23: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన ముద్దాయిని అరెస్టు చేయడం ద్వారా పోలీసులు కొంత పురోగతి సాధించారు. సంఘటన జరిగి ఆరు రోజులైనప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఎర్నాకులంలోని అడిషనల్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు లొంగిపోవడానికి వచ్చిన ప్రధాన ముద్దాయి పల్సర్ సుని, మరో నిందితుడు వి.పి.విజ్జేశ్‌లను పోలీసులు కోర్టు హాలులోనే నిర్బంధించారు. ఈ సంఘటనపై కోర్టు న్యాయవాదులు మండిపడుతున్నారు. లొంగిపోవడానికి వచ్చిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి ఈడ్చుకుపోవడాన్ని వారు తప్పుబట్టారు. పైగా హెల్మట్లతో పోలీసులు కోర్టు హాలులోకి దూసుకొచ్చారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు, ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంశాఖ బాధ్యతలు నిర్వరిస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిందితులను తక్షణం అరెస్టు చేయాలని పోలీసులకు బుధవారమే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రధాన నిందితుడు అరెస్టు కావడంతో ఈ కేసులోని అసలు నేరస్థుల ఎవరనే విషయం త్వరలోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

చిత్రం..హీరోయన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కొచ్చిలో ఆందోళన చేస్తున్న యువమోర్చా కార్యకర్తలపై వాటర్‌క్యానెన్లు ప్రయోగిస్తున్న దృశ్యం