జాతీయ వార్తలు

నాలుగో విడత ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 23: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి గురువారం జరిగిన నాలుగోవిడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 1.84 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 జిల్లాల పరిధిలోని 55 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారి వెల్లడించారు. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌లోనూ పోలింగ్ సజావుగా సాగింది. ఉదయం బూత్‌ల వద్ద ఓటర్లు స్వల్పంగా కనిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిఇవో స్పష్టం చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ రహదారులన్నీ సీజ్ చేశారు.
ఎన్నికలు జరిగే 12 జిల్లాల్లోనూ భద్రతాదళాల పెట్రోలింగ్ సాగింది. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర పారామిలటరీ దళాలను మోహరించారు. 680 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, కౌషాంబీ, అలహాబాద్, జాల్నా, ఝాన్సీ, లలిత్‌పూర్, మహోబా, బందా, హమీర్‌పూర్, ఛిత్రకూట్, ఫతేపూర్ జిల్లాల్లో నాలుగో విడత పోలింగ్ జరిగింది. మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేసింది. బిజెపి 48చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. మిగతా ఆరు నియోజకవర్గాలను మిత్రపక్షం అప్నాదళ్‌కు వదిలిపెట్టింది. అధికార సమాజ్‌వాదీ పార్టీ 30 నియోజకవర్గాల్లో, దాని మిత్రపక్షం 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. 2012 ఎన్నికల్లో 53 స్థానాల్లో ఎస్‌పి 24, బిజెపి 5, బిఎస్‌పి 15, కాంగ్రెస్ 6, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి నాలుగు విడతల పోలింగ్ పూర్తయింది. ఇక మూడు దశలు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 27, మార్చి 4, 8 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.

చిత్రం..అలహాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు