జాతీయ వార్తలు

గాడిదల్ని చూసినా భయమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహ్రైచ్ (యూపీ), ఫిబ్రవరి 23: యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయొద్దన్న ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవాచేశారు. గురువారం ఇక్కడ బిజెపి విజయశంఖానాద్ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ గుజరాత్ గాడిదలంటే అఖిలేశ్ ఎందుకంత భయపడుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు. రాయ్‌బరేలీ ఎన్నికల సభలో అఖిలేశ్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అఖిలేశ్ విమర్శలు అతడి నిజ స్వరూపాన్ని బయటపెట్టాయని ప్రధాని దుయ్యబట్టారు. ‘ఎన్నికల్లో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. అందులో భాగంగానే మోదీ, బిజెపిపై అఖిలేశ్‌జీ విమర్శలు చేస్తున్నారని అర్థం చేసుకోగలను. అయితే గుజరాత్ గాడిదలపై మీరు చేసిన వ్యాఖ్యలు నన్ను అశ్చర్యానికి గురిచేశాయి. వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ జంతువంటే ఎందుకంత కంగారో’ అంటూ మోదీ చురకలంటించారు. ఈ దేశ ప్రజలందరినీ తాను గురువుల్లా భావిస్తానన్న ప్రధాని గాడిదలను స్పూర్తిగా తీసుకుని పనిచేస్తానని అఖిలేశ్‌పై ఎదురుదాడి చేశారు. ఆ అమాయక జంతువు గురువుల పట్ల విధేయతతో ఉండడమేకాదు.. అంకితభావం, రేయింబవళ్లూ కష్టపడే తీరు మరచిపోవద్దని అన్నారు. ఎన్నికల ప్రచారంలో జంతువులను కూడా విడిచిపెట్టకుంటా విమర్శలు చేయడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ‘మీ ప్రభుత్వానికి జంతువులంటే అమితమైన ప్రేమ ఉండడం సహజమే’ అని మోదీ వ్యంగ్యంగా అన్నారు. అవి తప్పిపోయిన వెతికిపట్టుకుని మరీ మీ ‘పనితీరు’ను రుజువుచేసుకున్న సంఘటనలున్నాయని పేర్కొన్నారు. ‘ఎస్‌పి మంత్రి అజాంఖాన్ తన దున్నపోతులు తప్పిపోయాయని రామ్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఆఘమేఘాలపై రంగంలోకి దిగి ఆచూకీ పట్టుకున్న ఘనత వహించిన ప్రభుత్వం మీది’ అంటూ అఖిలేశ్‌పై విరుచుకుపడ్డారు. కాబట్టి జంతువుల మధ్య వివక్ష చూపడం సరైంది కాదని ఆయన అన్నారు.