జాతీయ వార్తలు

ఒక్కడు చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఫిబ్రవరి 24: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే రాష్ట్రంలోనూ తమ పార్టీ నాయకుడని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీతో బిజెపి ముఖాముఖి పోటీ పడుతోంది. మణిపూర్‌లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ, ఈ ఎన్నికల్లో పార్టీ నాయకుడు ప్రధాని మోదీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.్భబనందా సింగ్ పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదంటే, దానికి సమాధానం ఇవ్వవలసింది పార్టీ కేంద్ర నాయకత్వమే. బహుశా సిఎం పదవికోసం చాలా ఎక్కువ మంది నాయకులు పోటీ పడుతుండటం కావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. మణిపూర్‌లో కొన్ని చిన్న పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాగ్రెస్, బిజెపిల మధ్యే ఉన్నట్టు కనపడుతోంది. సింగ్ శుక్రవారం ఇక్కడ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ రాష్ట్రం లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అస్సాంలో 15 ఏళ్ల కాంగ్రెస్ దుష్పరిపాలన తరువాత తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా ఈసారి మణిపూర్‌లో తమ పార్టీ మూడింట రెండు వంతుల భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. మొత్తం 60 సీట్లకు గాను నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) 21 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను నిలబెట్టింది. లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) 11 నియోజవర్గాల నుంచి పోటీ చేస్తోంది. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) 15 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను నిలబెట్టింది. ‘మేము జాతీయ స్థాయిలో ఎన్‌డిఏలో భాగస్వాములం. కాని, ప్రాంతీయ పార్టీలకు స్వంత ఆకాంక్షలు, అజెండా ఉంటా యి. దీంతో పాటు బిజెపికి ఒంటరిగానే అధికారంలోకి వస్తానన్న గట్టి విశ్వాసం ఉంది’ అని ఎన్‌పిపి ప్రధాన కార్యదర్శి వివేక్ రాజ్ వాంగ్‌ఖెమ్ అన్నారు. ‘కేంద్రం లో ఎన్‌పిపితో మాకు పొత్తు ఉంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల మా వ్యూహాలు కూడా భిన్నంగా ఉన్నాయి’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సింగ్ పేర్కొన్నారు. అయితే, ఎన్‌డిఏలో భాగస్వామ్య పక్షాలైన ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో విడివిడిగా పోటీ చేయడం రాష్ట్ర ప్రజానీకాన్ని వంచించడానికే అని కాంగ్రెస్ పార్టీ నిందించింది. ఎన్‌పిపికి వ్యతిరేకంగా బిజెపి పోరాడుతున్నట్టు ప్రజలను మోసగించే కుట్ర ఇదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాపతి సెజం ఆరోపించారు. బిజెపి రాష్ట్రంలో యుఎన్‌సితో కలిసి పనిచేస్తోందని, ఈ రెండూ కూడా ‘ఆర్థిక దిగ్బంధం’ వెనుక ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు.