జాతీయ వార్తలు

బిజెపికి తిరుగేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోండా, ఫిబ్రవరి 24: నోట్ల రద్దు తర్వాత మహారాష్టత్రో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ఘన విజయాలు సాధించడంతో నూతనోత్సాహంతో ఉరకలు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిని తుదముట్టించడానికి తాను కృతనిశ్చయంతో ఉన్నానని చెప్పారు. ‘ఒడిశా రాష్ట్రం.. పేదరికం, ఆకలి, నిరుద్యోగం అక్కడ చాలా ఎక్కువ.. అక్కడ బిజెపికి తమ పార్టీ జెండా ఉంచడానికి కూడా పట్టు లేదు. అలాంటి రాష్ట్రంలో కూడా ప్రజలు బిజెపికి ఎంతో మద్దతు ఇచ్చారు. దాన్ని చూసి జనం నిర్ఘాంతపోయారు.. చివరికి పేదలు కూడా బిజెపికి మద్దతుగా నిలిచారు’ అని శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండా లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోదీ అన్నారు.‘ నిన్న మహారాష్ట్ర ప్రజలు తమ తీర్పు ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశా, మహారాష్ట్ర, చండీగఢ్, గుజరాత్.. ఇలా గత మూడు నెలల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా, బిజెపికి ఉనికి ఉన్నా లేకున్నా జనం తమ మూడో కన్నును ఉపయోగించి బిజెపి విజయం సాధించేలా చూశారు. అంటే దీని అర్థం నా బాధ్యత మరింత పెరిగింది’ అని ప్రధాని అన్నారు.
మహారాష్టల్రో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తిరుగులేని విజయం సాధించిన విషక్షం తెలిసిందే. రాష్ట్రంలోని పది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా, ఎనిమిదింటిలో బిజెపి అతిపెద్ద పార్టీగా నిలవడంతో పాటుగా బృహన్ముంబయి కార్పొరేషన్‌లో శివసేనకు దీటుగా నిలవడం తెలిసిందే.
కాగా, ఈ రోజు శివరాత్రి కావడంతో పరమశివుడి ప్రస్తావన తెచ్చిన ప్రధాని జనం తమ మూడో కంటితో ఏది మంచో, ఏది చెడో చూడగలుగుతారని అన్నారు. ‘ఆధికార మత్తు మన తలకెక్కకూడదు. ప్రజలకు పూర్తి అంకిత భావంతో మరింతగా సేవ చేయడానికి అది మనకు స్ఫూర్తినివ్వాలి’ అని అంటూ, అవినీతి, నల్లధనంపై తన పోరాటం కొనసాగుతుందని, దేశాన్ని 70 ఏళ్లుగా దోచుకు తిన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. భారత్, నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ప్రసంగించిన మోదీ కాన్పూర్‌లో ఇటీవల జరిగిన రైలు దుర్ఘటనను ప్రస్తావిస్తూ, ఇది ఒక కుట్ర అని, సరిహద్దుకు ఆవలివైపునుంచి కుట్రదారులు దాన్ని అమలు చేశారని దర్యాప్తులో తేలిందంటూ పరోక్షంగా పాకిస్తాన్‌నుద్దేశించి అన్నారు. ‘గోండా నేపాల్‌కు ఆనుకుని ఉంది. సరిహద్దుకు ఆవలివైపున ఉన్న శత్రువులు తమ కుట్రలను కొనసాగించాలనుకున్నప్పుడు గోండాలో మరింత గట్టి నిఘా కొనసాగించాల్సిన అవసరం లేదా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘దేశ భక్తి పూర్తిగా ఉన్న వారినే గోండా ఎన్నుకోవలసిన అవసరం ఉంది అప్పుడే మనం గోండాకు ఏమయినా చేయగలం’ అని అంటూ, ఈ సారి ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి గానీ, బిఎస్పీకి కానీ ఒక్క సీటు కూడా రాకూడదని, అన్ని సీట్లూ బిజెపియే గెలుచుకునేలా చూడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

చిత్రం..గోండాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ