జాతీయ వార్తలు

‘బుల్లెట్‌కు బుల్లెట్ సమాధానం కాదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 24: జమ్మూ-కాశ్మీరులో శాంతిని పునరుద్ధరించేందుకు భారత్, పాకిస్తాన్ మధ్య మళ్లీ చర్చలు జరగాల్సిన అవసరం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఉద్ఘాటించారు. శ్రీనగర్‌లో శుక్రవారం ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్పాలన్న విధానం వలన ఒరిగేదీమే ఉండదని, అంతేకాకుండా ఈ విధానం వలన రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారుతుందని అభిప్రాయపడ్డారు. ‘బుల్లెట్‌కు బుల్లెట్‌తో సమాధానం చెప్పాలనుకోవడం సరికాదు. సహనం, ప్రేమ, చర్చల ద్వారానే బుల్లెట్‌కు సమాధానం చెప్పగలం. చర్చల ప్రక్రియను పునఃప్రారంభించడం ద్వారా దశాబ్దాల నుంచి నలుగుతున్న కాశ్మీరు సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.