జాతీయ వార్తలు

సోనియా, రాహుల్‌తో స్టాలిన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: తమిళనాడు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను డిఎంకె వర్కింగ్ ప్రెసిండెంట్ స్టాలిన్ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీఅయ్యారు. అనంతరం స్టాలిన్ విలేఖరులతో మాట్లాడుతూ తమిళనాడులో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలపై సోనియా, రాహుల్‌గాంధీతో చర్చించినట్టు వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీలో పళనిస్వామి బలనిరూపణ సందర్భంగా తమ పార్టీకి చేందని ఎమ్మెల్యేలను బయటకు పంపించి ఓటింగ్ నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివరించినట్టు తెలిపారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. తమిళనాడులో కాంగ్రెస్ తమ పార్టీతో పనిచేస్తున్నందునా సోనియాగాంధీకి తమిళనాడులో పరిస్థితులు వివరించి, రెండు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలన్న అంశం కూడా చర్చించినట్టు ఆయన వెల్లడించారు. అలాగే కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని సోనియాగాంధీ అడిగి తెలుకున్నారని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నియమాలకు విరుద్ధంగా పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిందని ఇప్పటికే గురువారం నాడు రాష్టప్రతికి ఫిర్యాదు చేశామని వివరించారు.