జాతీయ వార్తలు

వాళ్లది చీకటి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థనగర్ (యూపి), ఫిబ్రవరి 25: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రాకుండా బిజెపి, బిఎస్పీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. సిద్ధార్థనగర్ ఎన్నికల సభలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజలను బిజెపి తప్పుదోవపట్టిస్తోందని ధ్వజమెత్తారు. ఎస్‌పిని అడ్డుకునేందుకు ఏ క్షణమైనా బిజెపితో మయావతి జతకలిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వాస్తవానికి బిజెపికి ఆమె పరోక్షంగా సాయపడుతున్నారని అఖిలేశ్ విమర్శించారు. ‘ఇంతకుముందే బిజెపి నేతలకు మాయావతి రాఖీ కట్టారు. మరోసారి రక్షాబంధన్ జరుపుకోడానికి తహతహలాడుతున్నారు’ అని సిఎం విరుచుకుపడ్డారు. ‘బిఎస్పీ అధికారంలోకి రాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఎస్‌పిని అధికారంలోకి రానీయకుండా ఉండాలన్నదే అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. దీనికోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు’ అని అన్నారు. యూపీలో పోలీస్ స్టేషన్లన్నీ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. వంద పోలీసు స్టేషన్లలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టినట్టు బహుశా మోదీకి తెలియకపోవచ్చు అని అఖిలేశ్ చెప్పారు. ‘పోలీసు శాఖలో ఎన్నో రిక్రూట్‌మెంట్లు చేపట్టాం. గరిష్టంగా పదోన్నతులు కల్పించాం. గతంలో ఫోన్ చేసినా పోలీసులు స్పందించేవారు కాదన్న విమర్శలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే పది పదిహేను నిముషాల్లో పోలీసులు వాలిపోతారు. ఇదంతా మా ఘనతే’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ పేద ప్రజలు, రైతుల పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమంకోసం అనేక పథకాలు అమలుచేశామని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. సంత్ కబీర్‌నగర్ ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పరీక్షా కేంద్రాల్లో కాపీలను ప్రోత్సహిస్తూ వాటిని అఖిలేశ్ ప్రభుత్వం వేలం వేస్తోందని మోదీ చేసిన ఆరోపణలపై సిఎం ఎదురుదాడి చేశారు. ‘ప్రధాని మంత్రిగారూ పరీక్షల్లో కాపీల గురించి మాట్లాడుతున్నారు. నిజానికి కాపీ కొడుతున్నదే మీరు. ఎవర్నో అనుకరిస్తూ ఎవరో కుట్టి ఇచ్చిన దుస్తులు వేసుకున్నప్పుడు కాపీ సంగతి గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి షూట్ కుట్టించుకున్న మీరు దుర్వినియోగం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందని అఖిలేశ్ చెప్పారు. ‘అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటన సందర్భంగా మీ పేరు ఇన్‌ప్రింట్‌గా లక్షలాది రూపాయల ఖర్చుతో షూట్ తయారు చేయించుకుని వేసుకోలేదా?’ అని ఆయన ప్రశ్నించారు.