జాతీయ వార్తలు

తమిళనాడులో బోటు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదురై, ఫిబ్రవరి 26: తమిళనాడులో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ బోటు ప్రమాదంలో తొమ్మిది మంది యాత్రికులు దుర్మరణం చెందారు. ట్యుటికోరన్ జిల్లా మనపాడ్ సమీపంలో వీరు ప్రయాణం చేస్తున్న పడవ తలకిందులు కావటంతో ఈ దుర్ఘటన జరిగింది. రంగంలోకి దిగిన సహాయ బృందాలు పదిమందిని రక్షించగలిగాయి. మిగతావారికోసం గాలింపు జరుగుతోంది. సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో మనపాడ్ బీచ్‌ను సందర్శించిన యాత్రికుల బృందం జాలర్ల పడవలో షికారుకు బయలుదేరింది. పడవ బయలుదేరిన కొద్దిసేపటికే తీవ్రస్థాయిలో కెరటాలు రావటంతో అది తలకిందులైంది. యాత్రికులు అరవటంతో సమీపంలో ఉన్న జాలర్లు ఈత కొట్టుకుంటూ బోటు దగ్గరకు వెళ్లారు. మొత్తం 19మందిని బయటకు తీసుకువచ్చినా, వారిలో తొమ్మిది మంది అప్పటికే మరణించారు. మరికొందరు యాత్రికులు గల్లంతయ్యారు. జాలరి పడవల్లో షికారుకు వెళ్లటాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ అది ఇంకా కొనసాగటం వల్ల ఈ రకమైన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.