జాతీయ వార్తలు

నగదు రహితంతో నల్లధనానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: నగదు రహిత లావాదేవీలతో నల్లధనాన్ని అదుపు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛతా ఉద్యమంలో భాగంగా యువత అవినీతి వ్యతిరేక సైన్యంగా తయారు కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోద్వారా ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ పథకాలకు యువత రాయబారులుగా మారాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ‘ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి, మరింత ముందుకు తీసుకెళ్లండి. ఇందులో పాలు పంచుకొంటున్న ప్రతి వ్యక్తీ నాకు స్వచ్ఛత కోసం పోరాడే ఒక సైనికుడిగా కనిపిస్తున్నారు’ అని ప్రధాని అన్నారు. నగదుతోనే లావాదేవీలు జరిపే మనస్తత్వాన్ని జనం మార్చుకొని, క్రమంగా డిజిటల్ కరెన్సీ వైపు మళ్లుతున్నారని ప్రధాని అంటూ చెల్లింపులు జరపడానికి, అందుకోవడానికి తమ మొబైల్ ఫోన్లను ఒక సాధనంగా ఉపయోగించడం
ద్వారా యువకులు ఈ విషయంలో అందరికీ మార్గదర్శకులవుతున్నారన్నారు. గత రెండు నెలల్లో నగదు రహిత లావాదేవీలు జరిపినందుకు పది లక్షల మందికి నగదు పురస్కారాలు అందించడం జరిగిందని, 50 వేలకు పైగా వ్యాపారులు బహుమతులు అందుకున్నారని, డిజిటల్ చెల్లింపుల ఉద్యమాన్ని ప్రచారం చేసిన, ముందుకు తీసుకెళ్లిన ప్రజలు 150 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్‌మనీగా సంపాదించారని చెప్పారు. ‘్భమ్’ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ఈ యాప్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ప్రతి ఒక్కరు కనీసం 125 మందికి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
స్వచ్ఛ్భారత్ ఉద్యమం గురించి ప్రధాని మాట్లాడుతూ జనం మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సిగ్గుపడకూడదని అన్నారు. కొందరు సీనియర్ అధికారులు ఇటీవల తెలంగాణలోని గంగదేవిపల్లిలో రెండు గుంతల మరుగుదొడ్డిని ఎలా శుభ్రం చేయాలో స్వయంగా చేసి చూపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వందశాతం పచ్చదనం, పరిశుభ్రతను పాటిస్తున్న ఆ గ్రామస్థులను ప్రశంసించారు.
యువతలో శాస్త్ర సాంకేతికతలు మరింత పెరగాలని, దేశానికి మరింతమంది శాస్తవ్రేత్తలు రావాలని ప్రధాని అన్నారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిందన్నారు. ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్-2జి ఉపగ్రహం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అంధుల టి-20ప్రపంచ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకున్న భారత అంధుల క్రికెట్ జట్టును అభినందించారు. మహిళల పాత్ర గురించి మాట్లాడుతూ క్రీడలు, లేదా అంతరిక్ష రంగంలో కానీ మహిళలు ఎవరికన్నా వెనుకబడి లేరన్నారు.