జాతీయ వార్తలు

యూపీలో విజయం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహరాజ్‌గంజ్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 26: ఉత్తరప్రదేశ్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) నాశనం చేస్తున్నాయని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికలతో సంతుష్ట, కుల, వారసత్వ రాజకీయాలకు తెరపడటం ఖాయమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించి మూడింట రెండు వంతుల మెజార్టీతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని విస్తృతమైన మెజార్టీతో గెలిపించాలని, తద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరింత బలాన్ని చేకూర్చాలని ఆయన ఉత్తరప్రదేశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని కబేళాలపై నిషేధాన్ని విధించి, పశువుల రక్తానికి బదులుగా రాష్టమ్రంతటా పాలను, నెయ్యిని పారిస్తుందని అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలో 15 ఏళ్లుగా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి కుంటుబడిందని, విద్యుత్, ఔషధాల కొరతతో సామాన్య ప్రజలు, ప్రభుత్వం నుంచి బకాయిలు అందక రైతులు అల్లాడి పోయారని, మహిళల్లో అభద్రతా భావం గణనీయంగా పెరిగిపోయిందని అమిత్ షా అన్నారు.
నేడు అయిదో విడత పోలింగ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అయిదో విడతలో భాగంగా సోమవారం 11 జిల్లాల్లోని 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 11 జిల్లాల్లో నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న తేరాయ్ ప్రాంతం కూడా ఉంది. కాగా, ఈ ప్రాంతంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సైన్యం ఆదివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. కాగా, అయిదో విడత పోలింగ్ జరిగే నియోజవర్గాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన అమేథీ కూడా ఉండడంతో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపైనే ఉంది. సమాజ్‌వాది పార్టీ తరఫున వివాదాస్పద మంత్రి గాయత్రీ ప్రసాద్ ప్రజాపతి ఇక్కడినుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున అమితా సింగ్, బిజెపి తరఫున గరిమా సింగ్‌లనుంచి ఆయన గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అమితా సింగ్ కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్ భార్య కాగా, గరిమా సింగ్ ఆయన మాజీ భార్య కావడం గమనార్హం. దీంతో ఇక్కడ ఇద్దరు రాణుల మధ్య పోటీగా మారింది.
అయిదో విడత పోలింగ్ జరిగే జిల్లాల్లో బలరాంపూర్, గోండా, ఫైజాబాద్, అంబేద్కర్‌నగర్, బహ్రైచ్, శ్రావస్తి, బస్తీ, సిద్ధార్థ్‌నగర్, సంత్ కబీర్‌నగర్, అమేథీ, సుల్తాన్‌పూర్‌లున్నాయి. అంబేద్కర్‌నగర్ జిల్లా ఆలపూర్‌లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజా మృతితో ఎన్నికల కమిషన్ ఇక్కడ ఎన్నికలను మార్చి 9కి వాయిదా వేసింది. అయిదో విడత ఎన్నికలు జరిగే 52 అసెంబ్లీ స్థానాలకు గాను సమాజ్‌వాది పార్టీ 2012లో 37 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్, బిజెపిలకు చెరి 5 సీట్లు దక్కగా, బిఎస్పీ 3, పీస్ పార్టీ 2 సీట్లను గెలుచుకున్నాయి. నేపాల్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో గోండా, బహ్రైచ్, శ్రావస్తి, బలరాంపూర్, సిద్ధార్థ్‌నగర్ ఉన్నాయి. అయిదో దశలో మొత్తం 608 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటుండగా, అమేథీలో గరిష్ఠంగా 24 మంది బరిలో ఉన్నారు. 96 లక్షల మంది మహిళలతోసహా దాదాపు కోటీ 84 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో రాష్టమ్రంత్రులు వినోద్ కుమార్ సింగ్ అలియాస్ పండిట్ సింగ్ (తరబ్‌గంజ్), తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్‌పాండే (అయోధ్య), బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ అచల్ రాజ్‌భర్ (అక్బర్‌పూర్) ఉన్నారు.