జాతీయ వార్తలు

మేఘాలయలో ట్రక్కుబోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, ఫిబ్రవరి 26: మేఘాలయలోని పశ్చిమ కాశి హిల్స్ జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది చనిపోగా, మరో 50మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న కాంక్రీట్బారికేఢ్ను ఢీకొని బోల్తాపడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. జిల్లా ప్రధాన కేంద్రమైన నోంగ్‌స్టోయిన్‌కు 11 కిలోమీటర్ల దూరంలోని దోహ్‌క్రోహ్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. 12 మంది సంఘటన స్థలంలో మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు జిల్లా ఎస్పీ సిల్వెస్టర్ నోంగ్‌తంగర్ చెప్పారు. చనిపోయిన వారిలో 9 మంది మహిళలు, 13 ఏళ్ల బాలిక ఉన్నారు. దాదాపు 70 మంది ట్రక్కులో నోంగ్‌లాంగ్ గ్రామంలో ఉన్న ఓ చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్, హెల్పర్ సహా గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు, షిల్లాంగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

చిత్రం.. పశ్చిమ కాశీ కొండల్లో ఓ కాంక్రీట్ బారికేడ్‌ను ఢీకొన్న లారీ