జాతీయ వార్తలు

యుద్ధ సన్నద్ధతకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత నావికాదళం తన యుద్ధ సన్నద్ధతను సమీక్షించుకునేందుకు భారీ విన్యాసాలను నిర్వహించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న జలాంతర్గామితో పాటు, యుద్ధ విమానాల్ని తీసుకువెళ్లే ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, సుఖో య్-30, జాగ్వర్ ఫైటర్ జెట్‌లు, వంటి వాటితో ఆపరేషనల్ ఎక్సర్‌సైజ్ (ట్రాపెక్స్- 2017) నిర్వహించింది. నౌకాదళంతో పాటు వాయుసేన, పదాతి దళాలు, తీరప్రాంత దళాలు కూడా ఈ విన్యాసాల్లో భాగస్వామ్యం పంచుకున్నాయి. అరేబియా మహా సముద్రం, ఉత్తర మధ్య హిందూ మహా సముద్రంలో ఈ ప్రయోగాలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దాదాపు 45 ఓడలు, 50 నౌకా విమానాలు, తీరప్రాంత దళానికి చెందిన 11 ఓడలు, అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న చక్ర జలాంతర్గామి, వాయు సేనకు చెందిన 20 సుఖోయ్ యుద్ధ విమానాలు, జాగ్వర్ విమానాలు ఈ ట్రాపెక్స్ విన్యాసాల్లో పాల్గిన్నాయి. ‘‘ ఈ విన్యాసాలు ఆర్మీ, వాయు, నౌకా దళాల సమష్టి సహకారంతో విజవంతంగా నిర్వహించాం. భారత సైన్యం ఏ మేరకు యుద్ధ సన్నద్ధతతో ఉందో పరీక్షించటం జరిగింది’’ అని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

అరేబియా, హిందూ మహాసముద్రాల్లో నెలపాటు సాగిన సైనిక విన్యాసాలు