జాతీయ వార్తలు

2014మాదిరిగానే మళ్లీ ఆదరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావు (యూపి) ఫిబ్రవరి 27: ఉత్తరప్రదేశ్‌లో ఓటమి దాదాపు ఖరారని నిర్ధారించుకున్న సమాజ్‌వాది, బహుజన్ సమాజ్ పార్టీలు కొత్త గేమ్‌కు తెరలేపాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మావులో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘మూడో దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎస్పీ, బిఎస్పీలకు తమ ఓటమి ఖాయమని అర్థమైపోయింది. దీంతో కొత్త అంకానికి తెరలేపాయి. మనం ఓడిపోయినా లేక మన సీట్లు తగ్గినా మరెవరికీ మెజార్టీ రాకుండా చూడాలి. నేను ఎస్పీ, బిఎస్పీల నేతలకు ఒక్కటే చెప్పదలచుకున్నా.. బిజెపిని ఓడించటానికి మీరెన్ని ప్రయత్నాలైనా చేయండి అభ్యంతరం లేదు. కానీ యూపి భవిష్యత్తుతో మాత్రం ఆటలాడకండి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోయారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మీరు (ఎస్పీ, బిఎస్పీ) హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బేరసారాలకు అవకాశం దొరుకుతుందని మీరు ఆలోచిస్తుండవచ్చు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమ సత్తా ఏమిటో చూపించారు. ఢిల్లీలో పూర్తి మెజార్టీతో బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు కూడా యూపిలో అదే పునరావృతం అవుతుంది’ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీని తమ పార్టీకి ఇచ్చి గెలిపించాలని మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..మావులో బిజెపి నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ