జాతీయ వార్తలు

మా మెట్రో రైలు ఇదిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియోరియా (యూపీ), ఫిబ్రవరి 27: ప్రధాని నరేంద్ర మోదీ బుల్లెట్ రైలు హామీ ఏమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ఆనక వాటి అమలు విషయంలో ఘోరంగా విఫలమయ్యారని సోమవారం ఆరోపించారు. ఇంకో చాన్స్ ఎలాగూ ఉండదు కాబట్టి బుల్లెట్ రైలు హామీ అమలుచేసి చూపండి అంటూ సవాల్ చేశారు. గుజరాత్‌కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ కనీసం మెట్రోరైలు తేలేకపోయారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఎద్దేవా చేశారు. ‘యూపీలో మేం మెట్రోరైలు ప్రారంభించాం. మీ బుల్లెట్ రైలు ఎక్కడ?’ అని సిఎం ప్రశ్నించారు. ‘గుజరాత్‌లో మూడుసార్లు సిఎంగా ఉన్నప్పుడు మెట్రో రైలుకు ఎలాంటి ప్రయత్నం చేయని మీరు ఇప్పుడైనా బుల్లెట్ రైలు తీసుకురావాలి. ఇలాంటి అవకాశం మీకు రమ్మంటే రాదు’ అంటూ అఖిలేశ్ సవాల్ చేశారు. యూపీలో మూడుచోట్ల మెట్రో రైలుకు పనులు ప్రారంభించామని ఆయన వెల్లడించారు. యూపీ విద్యా సంస్థల్లో మాస్ కాపీయింగ్‌పై మోదీ చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘పరీక్షలు ఎక్కడ జరిగినా.. అవి బిజెపి పాలిత రాష్ట్రాల్లోనైనా పేపర్లలీక్, కాపీయింగ్ జరిగిన సంఘటనలు ఉన్నాయి’ అని ఈ విషయం ప్రధాని తెలుసుకోవడం మంచిదని అన్నారు. బరాక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంగా మోదీ ధరించిన షూట్ కాపీ కిందకు రాదా? అని అఖిలేశ్ నిలదీశారు. యూపీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేదంటూ గోరఖ్‌పూర్ బిజెపి ఎంపీ యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ విద్యుత్ తీగల్లో కరెంట్ ఉందీ లేనిదీ తెలియాలంటే తీగలను పట్టుకుని చూడండి బాబాజీ అంటూ అఖిలేశ్ చురకేశారు.