జాతీయ వార్తలు

తెరమీదకొచ్చిన ‘విభజన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 27: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ విభజన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలంటూ బిఎస్పీ అధినేత్రి మాయవతి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ నిద్రాణంగా ఉన్న విభజన డిమాండ్‌కు ఒక్కసారిగా కదలిక వచ్చింది. ‘బిఎస్పీ అధికారంలోకి వస్తే ఇక వౌనం వహించం. యూపీని నాలుగు చిన్న రాష్ట్రాలుగా చేసి చూపుతాం. గతంలో మా ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటాం’ అని గోరఖ్‌పూర్ ఎన్నికల సభలో మాయావతి వెల్లడించారు. తూర్పు యూపీ.. పూర్వాంచల్‌కు గోరఖ్‌పూర్ కేంద్ర బిందువుగా ఉంది. దశాబ్దాలుగా ఉన్న వెనుకబాటుతనాన్ని పారదోలాలన్న కృతనిశ్చయంతో బిఎస్పీ పనిచేస్తోందని ఆమె చెప్పారు. ఇక్కడ ఆరో విడతలో భాగంగా మార్చి 4న ఎన్నికలు జరుగుతున్నాయి. 2011లో మాయావతి ప్రభుత్వం చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. హరిత్‌ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవాధ్‌లుగా విభజించాలన్నది బిఎస్సీ ప్రతిపాదన. రాష్ట్ర విభజన జరిగితేనే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని మాయావతి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని ఆమె తెలిపారు. విభజనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, బిజెపి, ఎస్‌పిలకు ఈ ఎన్నికల్లోనైనా తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు ఆమె పిలుపునిచ్చారు. బిఎస్‌పి సహా ప్రధాన రాజకీయ పార్టీలు వౌనం దాల్చడంతో విభజన అంశం ఇప్పటివరకూ నిద్రాణంగానే ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో బిఎస్పీ దీన్ని లేవనెత్తడంతో మళ్లీ తెరమీదకు వచ్చింది. యూపీ విభజనను మాయావతి గట్టిగా సమర్థిస్తున్నారు. శాంతిభద్రతలు, అభివృద్ధిని సమాజ్‌వాదీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆమె విరుచుకుపడుతున్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని మాయావతి గట్టిగా వాదిస్తున్నారు.

చిత్రం..ఆజాంఘర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఓటర్లకు అభివాదం చేస్తున్న బిఎస్‌పి అధినేత్రి మాయావతి