జాతీయ వార్తలు

మరో 3 ప్రయోగాలకు ఇస్రో సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 27: మరో మూడు భారీ ప్రయోగాలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. ఇటీవల 104 ఉపగ్రహాలను ప్రయోగించి విజయం సాధించిన ఇస్రో శాస్తవ్రేత్తలు అదే ఉత్సాహంతో మరో భారీ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేష్ కేంద్రం వేదిక కానుంది. మార్చి మాసాంతంలో పిఎస్‌ఎల్‌వి మార్క్-3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏప్రిల్ నెలలో పిఎస్‌ఎల్‌వి ఎఫ్09 ద్వారా జిశాట్ -9 ఉపగ్రహానికి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ చివరిమాసంలో పిఎస్‌ఎల్‌వి సి-36 ప్రయోగం ఉన్నట్లు సమాచారం. రెండు నెలల్లో మూడు ప్రయోగాలు చేసేందుకు ఇస్రో పూర్తి ప్రణాళిక రూపొందించుకుంది. ఇప్పటికే జిఎస్‌ఎల్‌వి మార్క్-3కు సంబంధించిన మూడు దశల క్రయో ఇంజన్‌కు సంబంధించి తుది పరీక్షల్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటికే మూడు దశల అనుసంధాన పనులు కూడా శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు. మార్చి 31న ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది అత్యధికంగా తొమ్మిది ప్రయోగాలను చేపట్టిన ఇస్రో ఈ ఏడాది కూడా అదే తరహాలో అధిక ప్రయోగాలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.