జాతీయ వార్తలు

హైకోర్టు విభజనలో ఆలస్యమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: హైకోర్టు విభజన అనివార్యంగా ఆలస్యమవుతోందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ప్రధాని మోదీ ఆరా తీసినట్టు తెలిసింది. హైకోర్టు విభజనకు కేంద్రంపై తెలంగాణ వత్తిడి తెస్తున్న నేపథ్యంలో, ఈ అంశం ఇరువురి భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. విభజనకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ నివేదించారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, విభజన చట్టం అమలు పరిస్థితిని వివరించారు. ప్రధాని అధికార నివాసం 7, ఆర్‌సిఆర్‌లో గంటకుపైగా జరిగిన భేటీలో పలు అంశాలు మోదీ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. గంటకుపైగా భేటీ సాగటంతో, హోంమంత్రి రాజ్‌నాథ్‌తో ఉన్న అపాయింట్‌మెంట్‌ను వాయిదా వేసుకున్నారు. విభజన చట్టం అమలు, నెలకొన్న సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా బోర్డు పని తీరు తదితర అంశాలను ప్రధానికి సోదాహరణగా వివరించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు, వివాదాలు, వీటి పరిష్కారానికి గవర్నర్ అధ్యక్షతన ఏర్పాటైన రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ పనితీరును మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఆంధ్ర నూతన రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయం, శాసన సభ నిర్మాణం తదితర అంశాలను గవర్నర్ నరసింహన్ ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారని అంటున్నారు.

చిత్రం..మోదీతో సమావేశమైన గవర్నర్ నరసింహన్