జాతీయ వార్తలు

పోలీస్ అకాడమీ కొత్త డైరెక్టర్‌గా బర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డిఆర్ డోలె బర్మన్ నియమితులయ్యారు. డైరెక్టర్ అరుణ బహుగుణ పదవీ కాలం ముగిసినందున మంగళవారం పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్‌గా బర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 (జమ్ము అండ్ కాశ్మీర్ కేడర్) బ్యాచ్‌కు చెందిన బర్మన్ ఇండోర్‌లోని నార్త్, ఈస్టర్న్ అకాడమీలో డైరెక్టర్‌గా ఉన్నారు. అరుణ బహుగుణ దేశంలోనే మొదటి మహిళగా 27 డిసెంబర్ 2013లో పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జాతీయ పోలీస్ అకాడమీకి మూడేళ్లపాటు సేవలందించిన అరుణ బహుగుణ 139 మంది ఐపిఎస్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ అకాడమీలో మాల్దీవులు, నేపాల్, భూటాన్‌లకు చెందిన 15 మంది ఐపిఎస్‌లకు కూడా శిక్షణ ఇచ్చారు. 1957లో రాజస్థాన్‌లో జన్మించిన ఆమె 1979లో ఐపిఎస్ అధికారిణిగా నియమితులయ్యారు. ఎస్‌విపి నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌కు ముందు ఆమె సిఆర్‌పిఎఫ్ డిజిగా, ఏడిజిపి (కో-ఆర్డినేషన్) ఐజిపి (పోలీస్ కంప్యూటర్, సర్వీస్, హ్యూమన్ సెల్) ఏడిజిపి (ట్రైనింగ్) డిజిపి (డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్)గా పనిచేశారు. 1995లో మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2005లో రాష్టప్రతి అవార్డుతోపాటు 2016లో బెస్ట్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా హోంమంత్రిత్వ శాఖ నుంచి ట్రోఫీ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత అరుణ బహుగుణ డిజిపి రేసులో కూడా ఉన్న విషయం తెలిసిందే. పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో సేవలందించిన ఆమె పదవీ విరమణ సందర్భంగా అకాడమీలో మంగళవారం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అరుణ బహుగుణ మాట్లాడుతూ, దేశ రక్షణ, జాతి సమగ్రతకు పాటుపడాలని ఆమె ప్రొబేషనరీ ఐపిఎస్‌లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అరుణ బహుగుణను పలువురు అధికారులు సత్కరించారు.

చిత్రం..పోలీస్ అకాడమీ కొత్త డైరెక్టర్ బర్మన్