జాతీయ వార్తలు

జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాల నివృత్తికి దర్యాప్తు చేయించాలని అన్నాడిఎంకె ఎంపీ వి మైత్రేయన్ విజ్ఞప్తి చేశారు. మైత్రేయన్ మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈ మేరకు కోరారు. రాష్టప్రతిని కలిసిన అనంతరం రాష్టప్రతి భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ జయ మృతిపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. ‘అమ్మ అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నారని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు అడిగినా అదే సమాధానం. ఆసుపత్రిలో ఉన్న 72 రోజులూ అలాగే చెప్పుకుంటూ వచ్చారు. ఆకస్మాతుగా జయ ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని వెల్లడించారు’ అని ఎంపీ తెలిపారు. తమిళనాడులో ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపై దర్యాప్తునకు అంగీకరించదని భావించే రాష్టప్రతికి వినతిపత్రం అందజేసినట్టు మైత్రేయన్ చెప్పారు. 75 రోజులపాటు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందిన జయలలిత డిసెంబర్ 5న కన్నుమూశారు. లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు రిచర్డ్‌బాలే ఆధ్వర్యంలో అమ్మకు వైద్యం అందించారు. ఆమె మృతిపై పలు అనుమానాలు రావడంతో రిచర్డే స్వయంగా వాటిని తోసిపుచ్చారు.