జాతీయ వార్తలు

పట్టణీకరణపై జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: పట్టణీకరణ సంస్కరణలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పట్టణ అభివృద్ధి విభాగాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఇంక ఎంతమాత్రం జాప్యం జరగడానికి వీలులేదని మంగళవారం జరిగిన సదస్సులో స్పష్టం చేశారు. పట్టణ పాలన, ప్రణాళిక, ఫైనాన్సింగ్ అన్నవి మొత్తం ఈ మార్పుల ప్రక్రియలో అత్యంత కీలకమని స్పష్టం చేశారు. వాటిని సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పట్టణాల్లో అనుకున్న రీతిలో మార్పులను తీసుకురావాలంటే ఇంకో ఎన్నో ఎన్నో మైళ్లను అధిగమించాల్సి వుందని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాలను సుస్థిర అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి రానున్న మూడేళ్లు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు.