జాతీయ వార్తలు

4వేలు పెరిగిన పిజి మెడికల్ సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: దేశవ్యాప్తంగా గల వివిధ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల్లో కలిపి 2017-18 విద్యాసంవత్సరంలో మరో నాలుగు వేలకు పైగా పోస్టు గ్రాడ్యుయేట్ (పిజి) సీట్లను సృష్టించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా గురువారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు. ఇన్ని ఎక్కువ సీట్లను పెంచడం ఇదే మొదటిసారని, ఈ అదనపు సీట్లతో కలిపి దేశంలో మొత్తం పిజి సీట్ల సంఖ్య 35,117కు పెరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో వైద్య విద్యను బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను ముందుకు తీసికెళ్లడానికి ఈ సీట్ల పెంపు దోహదపడుతుందన్నారు. సీట్ల పెంపునకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ద్వితీయ, తృతీయ స్థాయిల్లో ఎక్కువ మంది స్పెషలిస్టు డాక్టర్లను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం అదనంగా అయిదు వేల పిజి మెడికల్ సీట్లను సృష్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అదనపు సీట్లలో 2,046 సీట్లను మెడికల్ కళాశాలల్లో పెంచారు. పిజి సీట్లను పెంచడానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని క్లినికల్ సబ్జెక్టులలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని సవరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని నడ్డా తెలిపారు. దీనివల్ల 71 కళాశాలల్లో అదనంగా 1,137 సీట్లు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. మొత్తం 212 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని అనేక ఇతర కళాశాలలు ప్రతిపాదనలు పంపిస్తున్నాయని, ఫలితంగా ఈ నెలలో అదనంగా కనీసం వెయ్యి సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ అదనపు సీట్లలో ఎండి/ఎంఎస్‌కు తత్సమానమైన డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డిఎన్‌బి) సీట్లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. మొత్తం మీద ఇప్పటి వరకు దేశంలో 4,193 పిజి సీట్లు పెరిగాయని, ఈ నెలలోనే మరో వెయ్యి సీట్లు పెరగనున్నాయని ఆయన తెలిపారు.