జాతీయ వార్తలు

భావ ప్రకటనా స్వేచ్ఛకూ పరిమితులుంటాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: భావప్రకటనా స్వేచ్ఛను తాను సమర్థిస్తానని, అయితే అదికూడా చట్టాల పరిధిలోనే ఉండాలని రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన డిఆర్‌డిఓ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం సందర్భంగా విలేఖరులు ఎబివిపికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్ వివాదం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పారికర్ ఈ వ్యాఖ్యలు చేవారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్క సంఘటనకు సంబంధించినది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. గత నెల 22న ఢిల్లీలోని రామ్‌జాస్ కాలేజిలో జరిగిన దాడిలో ఎబివిపికి చెందిన కొంతమంది హస్తముందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గుర్‌మెహర్ కౌర్ సోషల్ మీడియాలో ఎబివికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం తెలిసిందే.