జాతీయ వార్తలు

హరిత రాజధానిగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధాని ఎంపికకు ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సిఫారసు చేసిన ప్రమాణాలు అమరావతికి సరిపోతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాది ఏ.పి.గంగూలీ గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు వాదించారు. అమరావతి పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్లను హరిత ట్రిబ్యునల్ నేడు విచారించింది. రోడ్ల అనుసంధానత, నీటి లభ్యత, ప్రమాదాలు సంభవించే శాతం తక్కువగా ఉండటం వల్లనే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నామని గంగూలీ వాదించారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలను అధ్యయనం చేసిన తరువాతనే విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో కొత్త రాజధానిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ట్రిబ్యునల్‌కు వివరించారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పారు. అమరావతిని హరిత రాజధానిగా నిర్మిస్తున్నామని గంగూలీ ట్రిబ్యునల్‌కు చెప్పారు. గంగూలీ రేపు కూడా ఏ.పి తరపున తన వాదనలు వినిపిస్తారు.