జాతీయ వార్తలు

అమరావతికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: ప్రపంచ శ్రేణి నగరంగా రూపు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్న అమరావతి నగరానికి చేయూతను అందజేసేందుకు ఖ్యాతి గాంచిన సంస్థ ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (టెరి-్ఢల్లీ) ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గ్రీన్ ఎనర్జీలో నూతన సాంకేతిక విధానాలను అమలు చేసేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. గ్రీన్‌ఫీల్డ్ అమరావతి నగరంలో అత్యంత ఇంధన సామర్థ్యంతో కూడిన భవనాల రూపకల్పనకు సహకరించేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపిస్తోందని ఏపిఎస్ ఈఈ, డిసిఓ ఎం.డి, మీడియా సలహాదారు ఏ.చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 8వ గ్రిహ సమ్మిట్ ‘ఇంధన సమర్థ గ్లోబల్ సిటీగా ఆవిర్భవించనున్న అమరావతి’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇంధన రంగంలో అంతర్జాతయ ఖ్యాతి గాంచిన ఈ సంస్థతో ఒప్పందం చేసుకోవటం ద్వారా అమరావతిని స్మార్ట్ నగరంగానే కాకుండా, ఇంధన పొదుపు, సంరక్షణలోనూ ప్రపంచంలో మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు. ఐరోపా, పాశ్చాత్య దేశాల సాంకేతిక సహకారంతో అమరావతిలో ఇంధన సమర్థ, పర్యావరణహిత భవనాలను నిర్మించాలనుకుంటున్నారు. ఈ భవనాల్లో దాదాపు అరవై శాతం వరకు ఇంధనం ఆదా అవుతుందని సంస్థ అధికారులు చెబుతున్నట్లు చంద్రశేఖరరావు చెప్పారు. ఇంధనాన్ని పొదుపు చేసే సంస్థలు సౌకర్యవంతంగానే కాకుండా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు దోహదపడతాయని సంస్థ ఎం.డి అజయ్ మాథుర్ చెప్పారు.