జాతీయ వార్తలు

రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ: గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, ఏప్రిల్ 23: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రమాదాలు సగానికి సగం తగ్గించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు శనివారం ఆయన తెలిపారు. ‘దురదృష్టవశాత్తు దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం 1.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు’అని అన్నారు. కేంద్ర రవాణ మంత్రిత్వశాఖ రోడ్డు ప్రమాదాలు 50 శాతం వరకూ తగ్గించడానికి కృషి చేస్తోందని మీట్‌ద ప్రెస్‌లో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ప్రమాదాలు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆయన వివరించారు. రహదారులను పరిస్థితిని మెరుగుపరచడం, మరమ్మతులు, మలుపుల వద్ద రోడ్లు విశాలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం అని గడ్కారీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులతో పాటు లక్షలాది మంది గాయపడి వైకల్యంతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఏటా మూడు లక్షల మంది గాయపడుతున్నారని మంత్రి తెలిపారు. ‘్భరత్‌ను రోడ్డు ప్రమాద రహిత దేశంగా చూడలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం’అని గడ్కారీ ప్రకటించారు. స్వీడన్‌లో గత ఏడాది ఒకే ఒక్క రోడ్డు ప్రమాదం జరిగినట్టు ఓ నివేదిక స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న 2500 ప్రాంతాలను గుర్తించామన్న గడ్కారీ వాటిని తగ్గించేందుకు అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. నేషనల్ హైవే నెట్‌వర్క్‌ను కనీసం 1.5 లక్షల కిలోమీటర్లకు విస్తరించాని రవాణ మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. పోర్టులు, పరిశ్రమల అభివృద్ధి కోసం 95వేల కోట్లరూపాయలతో సాగరమాల ప్రాజెట్టును చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.