జాతీయ వార్తలు

వారణాసికి ఎన్నికల వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, మార్చి 3: ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎన్నికల వేడి రాజుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వారణాసి ఒకటి. పోలింగ్ గడువుసమీపిస్తున్న దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు దీనిపైనే దృష్టి సారించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బిఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం వారణాసిలో ప్రచారానికి రానుండడంతో రాజకీయవాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాజకీయ ప్రముఖల తాకిడి వల్ల బందోబస్తు అధికారులకు శిరోభారంగా మారింది. ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలైంది. ప్రధాని పర్యటన ఖరారుపై జిల్లా అధికారులకు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటలకు మోదీ ఇక్కడకు చేరుకుంటారు. బెనారస్ విశ్వవిద్యాలయం అతిధి గృహంలో గంటసేపువిశ్రాంతి తీసుకున్నాక కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్తారు. కాశీ విశ్వనాథునికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న కాల భైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని, అఖిలేశ్, రాహుల్ గాంధీ రోడ్‌షోలకు తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అనివార్యమైంది. ఇరుకైన వీధులకు తోడు రోడ్‌షోలతో పరిస్థితి దారుణంగా ఉంటుందని, అయినా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రధాని రోడ్‌షో రెండుసార్లు వాయిదా పడింది. అయితే ఏడో విడత పోలింగ్ దగ్గరకు రావడంతో ఈసారి వాయిదా వేసుకోడానికి వీలుపడలేదు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పిజి)తో సంప్రదించిన తరువాత పది కిలోమీటర్ల మేర రోడ్‌షోకు జిల్లా యంత్రాంగం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ప్రధాని రోడ్‌షో కుచ్చెరిలో మొదలై గిరిజాఘర్ వద్ద ముగుస్తుంది. కాగా వారణాసిలో తమ సత్తాచాటాలని ఎస్‌పి, కాంగ్రెస్ కూటమి ఉవ్విళ్లూరుతున్నాయి. అలాగే బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి శనివారం వారణాసి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

చిత్రం..వారణాసిలో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా