జాతీయ వార్తలు

స్కూళ్లలో చైల్డ్ ట్రాకింగ్ సిస్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశవ్యాప్తంగా ఉన్న 20కోట్ల చిన్నారుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాఠశాలల్లో ఒక చైల్డ్‌ట్రాకింగ్ సిస్టమ్‌ను తీసుకువస్తోంది. వారు ఒక తరగతినుంచి మరో తరగతికి పురోగతిని గమనించడానికి, అలాగే డ్రాపవుట్లను (మధ్యలో బడి మానేసే వారిని) గుర్తించడం కోసం ఈ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. ఒక తరగతినుంచి మరో తరగతికి పురోగతిని గమనించడం కోసం, అలాగే డ్రాపవుట్లను గుర్తించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న 20 కోట్ల చిన్నారుల కోసం ఒక చైల్డ్‌ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నాం’ అని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం పాఠశాల విద్య రంగంలో తన మంత్రిత్వ శాఖ చేపట్టిన పలు చర్యలను వివరిస్తూ విడుదల చేసిన పలు ట్వీట్‌లలో పేర్కొన్నారు. విద్యాహక్కు కారణంగా బ్రిడ్జ్ స్కూల్స్ ఆలోచనను విరమించుకోవడం జరిగిందని కూడా ఆమె మరో ట్వీట్‌లో తెలిపారు. యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిపినట్లుగా సర్వశిక్షా అభియాన్ పురోగతిని ఏడాదికోసారి సమీక్షించడానికి బదులు తమ మంత్రిత్వ శాఖ ప్రతి రోజూ దాన్ని ఆన్‌లైన్‌లో గమనించడం జరుగుతుందని కూడా ఆమె తెలిపారు. యుపిఏ హయాంలో సర్వశిక్షా అభియాన్‌ను ఏడాదికోసారి సమీక్షించడం జరిగేది. దీనివల్ల సకాలంలో పరిష్కారాలు కనుగొనడానికి వీలయ్యేది కాదని అమె తెలిపారు. అంతేకాదు ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకోసం దేశంలో మొట్టమొదటిసారిగా ఒక పోర్టల్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని, దీనివల్ల వాటిలో పారదర్శకత, గ్రేడింగ్‌కు వీలవుతుందని కూడా ఆమె తెలిపారు. కాగా, ఇంతకు ముందు ఎన్‌సిఇఆర్‌టి మూడేళ్లకోసారి జరిపే నేషనల్ అసెస్‌మెంట్ సర్వేను ప్రతి ఏటా జరుపుతారని మంత్రి ప్రకటించారు.