జాతీయ వార్తలు

శివసేనదే మేయర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, మార్చి 4: ముంబై మేయర్ పదవి శివసేనకే దక్కనుంది. ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో బిజెపి, శివసేన రెండు సీట్ల తేడాతో సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబైలో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయ. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన శివసేన 84 సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తే 82 సీట్లు గెలుచుకున్న బిజెపి రెండోస్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉప్పూనిప్పుగా ఉంటూ వస్తున్న బిజెపి, శివసేన స్థానిక ఎన్నికల్లోనూ వేర్వేరుగానే పోటీ చేశాయి. ‘మహారాష్ట్ర ప్రజలు బిజెపికి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. అయితే శివసేన మాకంటే రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకున్నందువల్ల స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నాం. శివసేన అభ్యర్థులకు పూర్తిగా మద్దతిస్తాం. మేము విపక్షంలో కూర్చోము’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. మేయర్ పదవికి మార్చి 8న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో 122 సీట్లతో, మెజార్టీకి 21సీట్లు తక్కువగా ఉన్న బిజెపికి ఈ నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఆమోదం పొందాలంటే శివసేన మద్దతు తప్పనిసరి. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫడ్నవిస్‌తో చర్చలు జరిపిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాతే ఫడ్నవిస్ తాము పోటీలో లేమంటూ ప్రకటన చేశారు.